Use APKPure App
Get Pastors Telugu Study Bible old version APK for Android
Thousands of references added entire Bible
వ్యాఖ్యానాలను, నోట్సును మరియు రిఫరెన్స్ లను అర్థం చేసుకునే విషయంలో వివరణ:
దాదాపుగ అన్ని ముఖ్య వచనాలలో చిన్న తెరచిన పుస్తకం గుర్తులో వ్యాఖ్యానం ఇచ్చాం. దానిపైన నొక్కితే ఆ వచనానికి సంబంధించిన వివరణ వస్తుంది. అదే విధంగా రిఫరెన్స్ ల నిమిత్తము పుస్తకాల సముదాయంతో నిండిన గుర్తును నొక్కితే దానికి సంబంధించిన రిఫరెన్స్ లు అన్నీ వస్తాయి.
బైబిల్ రిఫరెన్సులకు ఈ క్రింది పద్ధతిని ఉపయోగించాం. ఆ రిఫరెన్సు అదే గ్రంథానికి చెందినదైతే ఈ గ్రంథం పేరును మళ్ళీ రాయలేదు. ఉదా।। ఆదికాండంలో ఒక నోట్ ఇలా ఉంటుంది. 2:25; 3:7,10,11 (ఇక్కడ 3:7,10,11 ఆదికాండంలోనిదన్నమాట)
వేరే గ్రంథానికి చెందిన ఒకటి కంటే ఎక్కువ రిఫరెన్సులను వాడేప్పుడు ఆ గ్రంథం పేరును మళ్ళీమళ్ళీ రాయలేదు.
ఉదా।। 1:1 కీర్తన 33:6,9; 102:25 (ఇక్కడ 102:25 కీర్తనల గ్రంథంలోనిదన్నమాట)
ఏదైనా ఒక వచనం పై గాని, వచనంలోని భాగం పై గాని ఒకటి కంటే ఎక్కువ నోట్సు ఉంటే మేము ఇచ్చే నోట్‌లో అది ఏ పదాన్ని వివరిస్తున్నదో ఆ పదాన్ని ప్రత్యేకంగా సూచించాం.
ఈ నోట్సులో ఎన్నో రిఫరెన్సులను ఇచ్చాం. ఎందుకంటే సూచించినమాటలనూ వాక్యాలనూ బైబిల్లో వేరే చోట్ల ఉన్న వాక్యాలతో మాటలతో సరిపోల్చుటవలన భావం మరింతగా గ్రాహ్యమౌతుంది. ఈ క్రింది విధంగా బైబిల్ పుస్తకాల పేర్లను క్లుప్తపరిచాం.
పుస్తకం పూర్తి పేరు --ఆదికాండం--
క్లుప్తపరిచిన పేరు --ఆది--
పుస్తకం పూర్తి పేరు --నిర్గమకాండం--
క్లుప్తపరిచిన పేరు --నిర్గమ--
నోట్స్ లో పొందుపరచిన రిఫరెన్స్ లనే కాక ప్రత్యేకంగా అనేక రిఫరెన్స్ లను ప్రత్యేకంగా పొందుపరచాము. ఈ రిఫరెన్స్ ల సమాహారాన్ని ఒక్కొక్కటిని తెరచి మననము చేసుకుంటూ వెళితే వాక్యంలోని దేవుని ప్రత్యక్షత మరింతగా బయలుపడుతుంది. దీనివలన దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొనుటలో అక్కడక్కడ తప్పిపోయే ప్రమాదం నుండి భద్రపర్చబడతాము మరియు సవివరంగా వాక్యాన్ని గ్రహించిన వారమై అనేకులకు విపులీకరించుటకు శక్తికలిగిన వారంగా పరిణతి చెందుతాము.
రిఫరెన్స్ లతో నిండిన అధ్యయన బైబిలును దేవుని దీవెనలు కోరుతూ ఆయన హస్తాలలో ఉంచాం. ఎన్నో సంవత్సరాలు కృషి చేసిన తరువాత దీనిని పూర్తి చేయడంలో మాకు శక్తినిచ్చిన దేవునికి మా కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. దీన్ని చదివే ప్రతివారికి ఇది దీవెనగా ఉండాలన్న ప్రార్థనతో దీనినందిస్తున్నాం. ఈ లోకమంతటిలోని పుస్తకాలన్నిట్లోకీ ఉత్తమమైన సర్వశ్రేష్టమైన పుస్తకం – బైబిలును చాలామంది మరెక్కువగా అర్థం చేసుకోవడంలో దేవుడు దీనిని వారి మేలుకోసం వాడుకొంటాడు గాక!
Last updated on Sep 11, 2023
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Uploaded by
Hương Trần
Requires Android
Android 4.1+
Category
Report
Pastors Telugu Study Bible
1.0.2 by Grace Ministries and Dusty Sandals
Sep 11, 2023